రంపచోడవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అరకు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంతల రాజేశ్వరి గారు అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగినది .ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా పులివెందుల గ్రామంలో ఒక ఎస్సీ మహిళ దారుణంగా హత్యకు గురవ్వడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి ఇలాకాలో జరగడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ అర్థమవుతుంది.కనుక పోలీసు తీరు చాలా దారుణంగా ఉందని వి చారం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి హత్యా రాజకీయాలు ఏ ప్రభుత్వంలో ఇప్పటివరకు జరగలేదు కనుక ఇది పూర్తిగా వైయస్సార్ ప్రభుత్వం వైఫల్యమెనని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. మరియు రాష్ట్రంలో మహిళల పైన దాడులు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఎన్ని దిశ పోలీస్ స్టేషన్ లు పెట్టిన మహిళలకు రక్షణ కరువైందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడబా ల బాపిరాజు ,మహిలనాయకురాలు Y నిరంజన్ దేవి, G సునీత,D జనార్ధన్ , సాలాది బాపిరాజు,సత్యవతి ,షేషయమ్మ, సింహాచలం మేహర్బబా గౌడ్,అన్నిక అప్పారావు,పాస్టర్ విశాల్, రమయమ్మ, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ యూసుఫ్ ఖాన్