- క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వీరమల్లు’
- చారిత్రక నేపథ్యంలో నడిచే కథ
- కీలకమైన పాత్రలో అర్జున్ రామ్ పాల్
- ఈ నెల 8 నుంచి కొత్త షెడ్యూల్
చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్ కి మంచి అనుభవం ఉంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ .. ‘మణికర్ణిక’ సినిమాలు అందుకు అద్దం పడతాయి. ఈ సారి కూడా ఆయన చారిత్రక కథాంశాన్నే ఎంచుకున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథతో ఆయన ‘హరి హర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నారు.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. 50 శాతం చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదాపడింది. చాలా గ్యాప్ తరువాత తిరిగి షూటింగును స్టార్ట్ చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన కొత్త షెడ్యూల్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు.
భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అర్జున్ రాంపాల్ .. జాక్వెలిన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైన కారణంగా ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాతనే మరో ప్రాజెక్టు పైకి వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారని సమాచారం.