విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

యస్.రాయవరం : పేట సూదిపురం గ్రామానికి చెందిన అవురు గుడ్డి చింతల్లి అనే మహిళ 45 రోజు మాదిరిగానే పశువులకు గడ్డి కోయడానికి యస్. రాయవరం మండలం సమీపంలో ఉన్న పొలం గట్టుకు వెళ్ళింది. ఈ భ్రమలో రాయవరం నుండి పేటసూదిపురం వెళ్లే విద్యుత్ వైరు తెగి నేల మీద పడింది అది ఆమె గమనించక పోవడంతో ఆ విద్యుత్ వైరు కాలుకు తగలటం వల్ల విద్యుత్ షాక్ తో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు ప్రమాద స్థలాన్ని గుర్తించి స్థానిక యస్. రాయవరం మండలం పోలీసులుకు సమాచారం అందించారు.వెంటనే స్థానిక యస్.ఐ సంఘట స్థలానికి చేరుకొన్నారు.కేవలం ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మామూలుగా విద్యుత్ వైరు మీద కొబ్బరి కమ్మ,కంప వంటివి పడినప్పుడు కరెంట్ ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా ఆగిపోతుంది అని ప్రజలు తెలిపారు.అలాంటిది విద్యుత్ వైరు నేల మీద పడినప్పుడు. విద్యుత్ సరఫరా నిలిచిపోకపోవడం విద్యుత్ శాఖ వారు చేసిన తప్పిదం వల్ల అని తెలిపారు ఆమెకు పరిహారం గా నష్ట పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు వ్యక్తం చేశారు.చనిపోయిన మృతురాలికి భర్త ,కుమారుడు,వివాహమైన కుమార్తె ఉన్నారు అని తెలిపారు. వివరాలు లోకి వెళితే ఎస్ఐ చక్రధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment