విద్యార్థుల పాదాల కొలతలకు ఎటూ సరిపోని బూట్లు

శ్రీకాకుళం, పొందూరుజగనన్న విద్యాకానుక లో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేసిన బూట్లు విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యంగా 9,10 తరగతుల బాలురకు గరిష్టంగా 7వ నెంబర్ సైజు బూట్లు అందించారు. అయితే అవి విద్యార్థుల పాదాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు. 8,9 వ నెంబరు సైజు గల బూట్లు అయితే సరిపోతాయని విద్యార్థులు అంటున్నారు. నవంబర్ 23 నుంచి పూర్తి స్థాయిలో పాఠశాలలు పనిచేస్తాయి అధికారులు చెబుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సరిపడే కొలతలతో బూట్లు అందజేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్.

 

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment