రైతు కవాత్-ప్లాగ్ మార్చ్ ను జయప్రదం చేయండి:పువ్వాళ్ల దుర్గాప్రసాద్

ముదిగొండ మండల కాంగ్రెస్ సమావేశం ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా,ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న రైతులకు మద్దతుగా ఈ నెల 28 సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన రైతు కవాత్-ప్లాగ్ మార్చ్ ని జయప్రదం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కోరారు.సోమవారం ఉదయం 10 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ఈ కవాత్ జరుగును ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత,మధిర శాసనసభ్యులు గౌ”శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు అని చెప్పారు కావున ముదిగొండ మండలం నుండి రైతులు,పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కవాత్ ని జయప్రదం చేయాలని కోరారు….ప్రజానేత్ర న్యూస్ ఛానెల్ ముదిగొండ ఆర్ పి
రమేష్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment