కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన పేరుతో రాష్ట్రానికి సమృద్ధిగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించి అన్యాయం చేస్తోందంటూ భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు బస్టాండ్ లో శనివారం రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మల్లికార్జున చంద్రశేఖర్ నగేష్ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ రహదారులు గుంటలు పడి ప్రమాదకరంగా ఉన్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు రు గ్రామీణ ప్రాంతాలలో రహదారులు మరింత అధ్వాన్నంగా మారాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అభివృద్ధికి చర్యలు చేపట్టి ఉంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు రాస్తారోకో చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఎస్ ఐ మస్తాన్ వలి ఆందోళనకారులతో మాట్లాడిన ఆందోళనను విరమింపజేశారు..
ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్.