మొక్కజొన్న పంట రైతులును ఆదుకోవాలని రైతుభరోసా కేంద్రంలో వినతిపత్రం అందజేసిన – బలగ శంకర్ భాస్కర్..

పొందూరు మండలంలోని రాపాక పంచాయతీ లో ఉన్న రైతులు స్థానిక తెలుగుదేశం పార్టీ మండల జడ్పీ టీ సి అభ్యర్థి బలగ శంకర్ భాస్కర్ తో కలసి రైతు భరోసా కేంద్రంనకు వెళ్లి గ్రామ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ సంగీతాను కలసి పంట కొనుగోళ్లు సమస్యలపై మాట్లాడుతూ.నివర్ తుఫాన్ ధాటికి రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా రైతులను మాత్రం విస్మరించింది. నిన్న ప్రకటించిన పెట్టుబడి రాయితీ లో జిల్లా పేరు లేకపోవడం ఇంతకన్నా ద్రోహమైన చర్య ఏముందని నాయకులు పెద్దపెద్ద ప్రకటనలు చేసినంత మాత్రాన రైతులకు మేలు జరగదు.
నేటికీ ధాన్యం కల్లాలోనే మగ్గుతున్నాయి. రైతుల కళ్ళల్లో కన్నీరు కారుతున్నాయి.నివర్ తుఫాన్ లో నష్టపోయిన ప్రతి రైతుకి పరిహారం అందించాలి. గతం ప్రతిపక్షం లో ఉన్నపుడు నేటి ఈ ముఖ్యమంత్రి చెప్పినట్టు ఎకరాకు 30000 రూపాయలు చెల్లించాలి.ప్రభుత్వం మద్దతుధర చెల్లిస్తూ మొక్కజొన్న పంటతో పాటు, రంగు మారిన ధాన్యం సైతం తీసుకోవాలి.లేని యెడల రైతుల తరుపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ,వినతిపత్రాన్ని అందించటం జరిగింది.

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment