మైనింగ్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ సభ

తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలో మైనింగ్ జోన్ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, మైనింగ్ అధికారులు, రైతులు, ప్రజలు లేకుండానే, రాకుండా నే 121 సర్వేనెంబర్ లో మైనింగ్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ సభ. నిర్వహించారు. ఈసభలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మైనింగ్ జోన్ ఏర్పాటును రద్దు చేయాలని. ఈ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమలు నెలకొల్పాలని రైతులు, ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఏమిటని ప్రశ్నించిన సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పెండ్యాల బ్రహ్మయ్య.పి. అంజయ్య లు డిమాండ్ చేశారు. గత తొమ్మిది సంవత్సరాల క్రితమే ప్రభుత్వ అధికారులు మైనింగ్ జోన్ ఏర్పాటు రద్దు చేస్తున్నామని. ప్రకటించి. తిరిగి మళ్లీ ప్రారంభించడం ఏమిటని అధికారులను నిలదీశారు. చుట్టూరా అడవి ప్రాంతం వ్యవసాయ పొలాలు చెరువులు కుంటలు కలిగినటువంటి. యాచారం రెవిన్యూ ప్రాంతంలో ప్రజల ఆమోదం లేకుండా మైనింగ్ జోన్ యూనిట్ ఎట్లా నిర్వహిస్తారని.. ప్రభుత్వం పర్యావరణానికి తీసుకున్న చర్యలు ఏమిటి అని దీని ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యం మీద భవిష్యత్తులో ఊపిరితిత్తుల వ్యాధి. క్యాన్సర్. ఆస్తమా. లాంటి రోగాలకు మైనింగ్ కారణమవుతోందని తెలిపారు.121 ,105 ,126 సర్వేనెంబర్ లలో గతంలోని ప్రభుత్వం11/07/1973 లో రెవెన్యూ బోర్డు తీర్మానం చేసి దళితుల భూమి గా ప్రకటించింది. నేడు వాటిలో ప్రజల ఆమోదం లేకుండా మైనింగ్ ఏర్పాటును ఎట్లా చేస్తారని కలెక్టర్ గారిని అడిగారు. మాస్టర్ ప్లాన్ లో 2031 వరకు. కన్జర్వేషన్ జోన్ గా ఉన్న దాంట్లో కాలుష్య కారక పరిశ్రమలు ఏమిటని ప్రశ్నించారు. రద్దు చేయాలని అనంతరం పలు డిమాండ్లతో కూడిన మెమోరండం కలెక్టర్ గారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జంగయ్య పెంటయ్య యాదగిరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment