మూడు పండగలు ఓకే రోజు

కర్నూల్ జిల్లా ప్యాపిలి టుడే  శుక్రవారం 2020మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెవేశ పెట్టిన నవరత్నాలలో భాగంగా శుక్రవారం పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణి ప్యాపిలి మండలంలోని చిన్న పుద్దిళ్ళ గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి దిలీప్ చక్రవర్తి, జడ్పిటిసి బొరెడ్డి శ్రీరామ్ రెడ్డి,సీఐ రామలింగమయ్య,వ్యవసాయ సలహా మండలి చెర్మెన్ మెట్టు వెంకటేశ్వర రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చెర్మెన్ బొరెడ్డి పుల్ల రెడ్డి , రామచంద్ర రెడ్డిమాట్లాడుతూ నేడు క్రిస్మస్, ముక్కొట్టి ఏకాదశి, మరియు పేదల ఇళ్ల పట్టాల పంపిణీ అన్ని కలిసి రావడం చాల సంతోషంగా ఉందని వారు తెలిపారు.వైయస్సార్ సిపి నాయకులు, అధికారుల చేతులమీదగా అర్హులైన 36 మంది పేదలకు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివరాముడు, యంపీడీఓ ఫజుల్ రహిమాన్,స్పెషల్ అధికారి నారాయణస్వామి, ఈఓఆర్డీ వెంకట్ రెడ్డి,డిప్యూటీ తహశీల్దార్ మారుతీ, చంద్రశేఖర్ రెడ్డి హౌసింగ్ అధికారులు, విఆరోఓ, మొదలగువారు పాల్గొన్నారు.
?ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment