మనుస్మృతిదహనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళిత,బహుజన సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి దహనం కార్యక్రమం స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1927 డిసెంబర్ 25న బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో మనుస్మృతి దహనం భారతదేశ బహుజన ఉద్యమ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిందని మహద్ సత్యగ్రహ వేదిక మీద నుండి అంబేద్కర్ ప్రసంగించిన అనంతరం, సత్యాగ్రహ ఉద్యమ కార్యకర్తల్లో ఒకరైన బాపూ సాహెబ్ సహస్ర బుదే మాట్లాడుతూ… పుట్టుక రీత్యా నేను ఒక బ్రాహ్మణుడు ను అయితే నేను కుల వ్యవస్థను,మునుస్మృతి తీవ్రంగా వ్యతిరేకిస్తానని, సాటి మానవుల పై జరిగిన అన్యాయాలకు, కుల వివక్షతకు ప్రతిరూపం ఈ మనుస్మృతి దీనిని బహిరంగంగా దహనం చేయడం వలన తరతరాలుగా జరిగిన దోపిడీని మట్టుపెట్టే దిశలో మనం ముందడుగు వేస్తున్నాం అని సహస్ర బుదే అంబేద్కర్ సమక్షంలో మనుస్మృతి దహనం చేశారు అని అన్నారు. మనుస్మృతి మరియు ఇతర దోపిడి సాధనాలైన పురాణసాహిత్యం యావత్ భారతీయులు అందరిలో కొందరికే కాదు భారతీయులందరికీ వ్యతిరేకమైనవి. కులనిర్మూలన జరిగితే దళితులకో, బహుజనులకో కాదు యావత్ భారతదేశానికి మంచి జరుగుతుందని అన్నారు. మనస్మృతిని నిర్మూలిద్దాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముద్దా పిచ్చయ్య, అలవాల రాజా, అల్లాడి పౌల్ రాజు, అర్థ వెంకటేశ్వరరావు, తోకల దుర్గా ప్రసాద్, కోట ప్రభాకర్,ఉంగుటూరి వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment