ఆస్పరి మండలంలో కైరుప్పల, బిలేకల్, ఆస్పరి గ్రామాల్లో సిపిఐ 96 వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవాలకు సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య గారు సిపిఐ పతాకాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశ స్వతంత్రం కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ అన్నారు. బ్రిటిష్ పరిపాలనకి వ్యతిరేకిస్తూ సమసమాజ స్థాపనకు పోరాటాలు చేసింది అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ మూడు బిల్లును చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోర్ దగ్గర మీటర్ బిగించే పద్ధతిని రద్దుచేయాలని ఉచిత బిల్లు ముద్దు అని అన్నారు. అత్యధిక వెనుకబడిన ఆలూరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలి అంటే తక్షణమే హగిరి పై వేదావతి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కృష్ణమూర్తి బ్రహ్మయ్య ఉరుకుంద రంగన్న ఆంజనేయ ఈరన్న శ్రీనివాసులు సుంకన్న ఎక్స్ ఎంపిటిసి రవీంద్ర వీరేష్ యువరాజు జైపాల్ హనుమంతు సురేష్ వీరేష్ చెన్నయ్య రాముడు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ శేఖర్ ఆస్పరి