బదరీ నారాయణ చేసిన సేవలకు గుర్తుగా ఘన సన్మానం

చలువాది బదరీ నారాయణ సేవలు మరువలేనివి…పాఠశాల వ్యవస్థాపకులు నాళం బాలాజీ రావు

చీమకుర్తి లోని పల్లమల్లి గ్రామం లో ని స్థానిక బిసి కాలనీలో ఏర్పాటు చేసిన గండ్లూరు వీర శివా రెడ్డి ప్రాథమికోన్నత పాఠశాలలోని గదులకు 60వేలు రూపాయలు ఖర్చు చేసి నాపరాళ్లు వేయించిన ఒంగోలు గెలాక్సి గ్రానైట్ అధినేత లయన్స్ క్లబ్ అఫ్ చీమకుర్తి అధ్యక్షులు చలువాది బదరీ నారాయణ. ఆదివారం తరగతి గదులను లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పి.విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డా.బి జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.జవహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సేవే లక్ష్యంగా అనేక గుప్త దానాలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్న గొప్ప వ్యక్తి చలువాది బదరీ నారాయణ అని కొనియాడారు. చలువాది బదరీ నారాయణ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో శ్రమించి ఎటువంటి ఫీజులు లేకుండా పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించటానికి ఈ లాంటి పాఠశాలను స్థాపించటం ఎంతో అభినందనీయం అని తెలిపారు.జిల్లా గవర్నర్ పి.విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన వసతుల కొరకు లయన్స్ క్లబ్ తన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. చుట్టూ ప్రక్కల పేదలను గుర్తించి నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తూ సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న పాఠశాల వ్యవస్థాపకులు నాళం బాలాజీరావు దంపతులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చలువాది రమేష్, ఎం.రాజా, ప్రిన్సిపాల్ కరేటి నరసింహారావు, ఏపీ ప్రజా సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రేమల కరుణాకర్, ఉపాధ్యాయులు పాలేటి శ్రీనివాసరావు, మస్తానమ్మ, సువర్ణ, మానస, కరిష్మా, రమ్య, కమల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి. వి. ఎన్. వి ప్రసాద రావు

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment