అశ్వాపురం:నేడు అనగా 20.12.2020 ఆదివారం సాయత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ హాల్లో డా.పిడమర్తి రవి గారి నాయకత్వంలో జరిగే మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని..మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు కోరారు.శనివారం నాడు మండల కేంద్రంలో మాదిగ జేఏసీ మండల అధ్యక్షుడు మందా హుస్సేన్ ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ…మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమం మాదిగలను ఐక్యం చేసి హక్కుల సాదించుకోవడానికే అని తెలిపారు.మాదిగల చిరకాల వాంఛ ఎస్సీల వర్గీకరణ మాదిగలకు అందని ద్రాక్ష లా మిగిలిందని అన్నారు..ఎస్సీ వర్గీకరణ కోసం గత రెండున్నర దశాబ్దాలుగా మాదిగలు ఉద్యమాలు చేస్తుంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మాదిగలను ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుంటున్నారని దుయ్యబట్టారు..తెలంగాణ రాష్ట్ర సాధకుడు..డా.పిడమర్తి రవి నాయకత్వంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనేక సార్లు ధర్నాలు,మౌన దీక్షలు,నిరసన ప్రదర్శనలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్దత కల్పిస్తానని హామీ ఇచ్చి మాదిగలను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా మాదిగలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ,తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ..జరిగే మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమానికి మాదిగ సంఘాల నాయుకులు కార్యకర్తలతో పాటు వివిధ పార్టీలలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు-ఎమ్మెల్యేలు-చైర్మన్లు-మాజీ ఎంపీలు-ఎమ్మెల్యేలు-కార్పొరేటర్లు-ప్రజాప్రతినిధులు హాజరౌతున్నట్లు తెలిపారు..కావునా జిల్లాలో ఉన్నటువంటి మాదిగ మేధావులు,విద్యార్థులు,మాదిగ జేఏసీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో మంగళగిరి రామకృష్ణ, అలవాల నాగరాజు,ఈనపల్లి రవి,మామిడాల శివయ్య, కృష్ణతేజ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు..
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్