నాయీబ్రాహ్మణులు,రజక సోదరుల కు సువర్ణవకాశం

సిద్దిపేట జిల్లాలో ఉన్న నాయీబ్రాహ్మణులు,రజక సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.కరోనా కష్టకాలంలో హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు నడవక ఇబ్బందులు పడుతున్న నాయీబ్రాహ్మణులకు మరియు రజకులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీ ప్రకటించడం సంతోషకరమైన విషయం.జిల్లాలోని గ్రామాలు,పట్టణాలు, మున్సిపాల్టీలలో ఉన్న హెయిర్‌ కటింగ్‌ సెలూన్ల యొక్క పూర్తి వివరాలని మీకు దగ్గరలో గల విద్యుత్ ఏఈలకు తెలియజేసి ప్రభుత్వం మనకు కల్పించిన ఉచిత విద్యుత్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోగలరు.ఈవిషయాన్ని మీతోపాటు మీకు ప్రక్కన ఉన్న గ్రామాల వారికి కూడ చెయిన్‌ సిస్టములా అందరికి తెలపగలరు.మీరు ఉన్నా షాప్ కిరాయకు ఉన్నా సొంతం ఐనా సరే దుకాణం గురించి తీసుకున్న సర్వీసు మీటర్లకే సబ్సిడీ వర్తిస్తుంది.
మీరు విద్యుత్ అధికారులకు ఈక్రింది విదంగా వివరాలని ఇవ్వాల్సి ఉంటుంది
1). సర్వీసుమీటర్‌నంబర్‌, 2). మీటరు ఎవరిపేరున ఉందో వారి పేరు, 3). షాపు చిరునామా, 4).
5). మీటర్‌కేటగిరి, 6). మీరున్న విద్యుత్ ఆఫీసు ఏరియా, 7). హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌, లేదా లాండ్రిషాప్‌, 8).సెలూన్‌ యజమాని/ నిర్వాహకుని ఆధార్‌కార్డు నంబర్, 9). లోకల్‌లో మీసంఘం రిజిస్టరు నంబర్, ఒకవేల స్థానికంగా లేకుంటే ఫోన్‌ చేసి జిల్లా నంబర్ వ్రాయండి, 10). సెలూన్‌ యజమాని/నిర్వాహకుని పేరు, 11). సెలూన్‌ షాప్ పేరు, 12). సెలూన్‌యజమాని/నిర్వాహకుని ఫోన్‌ నంబరు.వీటిని స్థానికంగా ఉండే మీ విద్యుత్ ఏఈలకు తెలియజేయగలరు

– గమనిక : డోమెస్టిక్‌ అంటే ఇంటి గురించి తీసుకున్న సర్వీసు మీటర్లకు వర్తించదు రిజెక్ట్ ఔతుంది కాబట్టి ఇంటి సర్వీసు మీటర్ల నంబర్లు ఇవ్వకండి….. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రీపోటర్ చిన్నకోడూరు మండలం

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment