దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

గంపలగూడెం:- ఈరోజు పెనుగొలను గ్రామంలో గత మూడు రోజులుగా నివార్ తుఫాను రావటం జరిగింది. తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు నష్టపోయారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు పిలుపుమేరకు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులను మరియు రైతు పొలాలను ను సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఎకరానికి ఇచ్చే 500 ఆర్థిక సహాయం ఎటూ సరిపోదని. ఒక రోజు వచ్చే కూలీ కి 500 ఇస్తాము అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులు కు కనీసం 20,000 ఎకరానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు కు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు అని రైతు లు కు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ తోట హరిబాబు, గ్రామ తెలుగు రైతు బొల గాని కోటేశ్వరరావు, మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు బొల గాని గోపాల్ రావు, గ్రామ తెలుగుయువత ఉపాధ్యక్షులు నల్ల గట్ల రాంబాబు మరియు వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు..!!

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment