దళిత సంఘాల ఆధ్వర్యంలో బి ఆర్ అంబెడ్కర్ 64 వ వర్ధంతి వేడుకలు

అశ్వాపురం ..నవ భారత రాజ్యాంగ నిర్మాత-భారతరత్న డా.బి ఆర్ అంబెడ్కర్ 64 వ వర్ధంతి వేడుకలను దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా విచ్చేసిన స్థానిక సీఐ.సట్ల రాజు గారు మండల కేంద్రంలో గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అక్షరాన్ని ఆయుధంగా మలిచి కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన ఓ.. మహోన్నతుడా.. నీకు ఇవే మా ఘనమైన నివాళులు.దేశంలో బడుగు బలహీన వర్గాలకు-బహుజనులకు విద్యా,ఉద్యోగ,రాజకీయ రిజర్వేషన్లతో పాటు ఓటు హక్కు ప్రాధమిక హక్కులను కల్పించిన గొప్ప మహనీయుడు అని కొనియాడారు.కుల వివక్షత సామాజిక ఆర్ధిక అణిచివేత అత్యాచారాలకు గురవుతున్న జాతుల కొరకు రాత్రనక పగలనక శ్రమించి తన జీవితాన్ని ధారపోసి భారత దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి ఆశయాల కొరకు మనమంతా కృషి చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు,ఎమ్ ఆర్ పీ ఎస్ జిల్లా నాయుకులు ఇసంపల్లి కృష్ణ,మైనార్టీ నాయుకులు నజీర్ షోను,కేసీఆర్ సేవా దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్,ఎమ్ ఎమ్ ఎస్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా,యాకుబ్ పాషా,బంటీ,నర్సింహ నాయక్,గౌతమ్, సతీష్,గాయత్రి,హేమా తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్ .

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment