కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లోని స్థానిక పట్టణం నందు మరియు పలు గ్రామాల్లో శుక్రవారం రోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ నందు గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము నందు ఉదయం 4:30 లకు ఉత్తర ద్వార దర్శనం తెరచి భక్త జన వాహినితో పూజా కార్యక్రమాలు జరిపినారు. అంతేకాకుండా 11:00 ల నుండి మొదలుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వేడుకలు జరిపినారు. ఈ కల్యాణ వేడుకలకు ఎక్కువ మంది భక్తాదులు పాల్గొన్నారని మరియు సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగింపుగా కొనసాగించడం జరిగినదని ఆలయ కమిటీ సభ్యులు శ్రీధర్ స్వామి,సుదర్శన్ రెడ్డి,గోపీనాథ్ నాయుడు,చిరంజీవి పేర్కొన్నారు.వెల్దుర్తి ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి వెల్దుర్తి..