- పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో ఘటన
- బాలికను రాయితో మోది చంపేసిన వైనం
- అనంతరం నిందితుడు పరారీ
వికారాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం చెలరేగింది. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో ఓ బాలికను ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆ బాలిక గ్రామ శివారుకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలికను రాయితో మోది చంపేసిన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన బాలిక కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.