జనగామ జిల్లా,దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య స్మారకా భవనంలో దొడ్డి భిక్షపతి అధ్యక్షత సమావేశానికి ముఖ్యఅతిథిగా గొర్రెల మేకల సంఘం జిల్లా కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కోసం జనగామ జిల్లాలో మూడు సంవత్సరాల క్రింద రెండో విడత గొర్రెల పంపిణీ డిడిలు తీసి..గొర్రెల పంపిణీ కోసం ఎదిరిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెడుతుంది. డిడి లు తీసి..భార్య పిల్లల మీద సొమ్ములు కొదువ పెట్టి..కొంతమంది అప్పులు తెచ్చి మిత్తులు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే.. జీ.ఎం.పీ.ఎస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నా..నాయకుల మీద కేసులు పెడుతున్న.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 20వ తేదీ,21వ తేదీన దొడ్డి కొమురయ్య స్థూపం నుండి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వరకు రెండు రోజుల పాటు పాదయాత్రలో పాల్గొని జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు.రిపోర్టర్:జి.సుధాకర్.