కిసాన్ జ్యోతి వెల్దుర్తి రైతులు

వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు సంఘాల జిల్లా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కిసాన్ జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ ఇరవై మూడు రోజుల నుంచి ఢిల్లీలో పోరాడుతున్న రైతుల పోరాటానికి సంఘీభావంగా వెల్దుర్తి మండలంలో కిసాన్ జ్యోతి వెలిగించడం అభినందనీయమని తెలియజేశారు. రైతుల కోరుతున్నట్టు 3 వ్యవసాయ చట్టాలను మరియు విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేశారు అని ఆరోపించారు. ఆ చట్టాలలో కనీస మద్దతు ధర లేదని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. ఇప్పటికే ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు దేశ వ్యాప్తం భారీగా మద్దతు లభించిందని అన్నారు. చట్టాలు నిత్యవసర వస్తువులు పేదలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయని కార్పొరేట్ కంపెనీలో కృత్రిమ కొరత సృష్టించి ప్రజలందరికీ ఆహారం అందకుండా కూడా చేసే ప్రయత్నం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటికే ఉల్లిగడ్డ రైతులు టమోటా రైతులు పడుకున్న బదాలు మనం చూశాం ఉన్నారు. కార్యక్రమాలు ఆందోళనలు నిర్వహించాలని తెలియజేశారు. 21వ తేదీ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజు ,రాముడు, హమాలి యూనియన్ నాయకులు యేసు, రైతులు రాముడు, పెద్దన్న, పెద్దయ్య, మధు, ఏఐటీయూసీ నాయకులు మాధవ స్వామి
మరియు యువకులు కార్మికులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి .

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment