కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యంపీడీఓ కి విన్నత పత్రం

కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలంలో వివిధ గ్రామాల్లో సి సి రోడ్డుల సౌకర్యం, మురుగునీటి కాలువలు నిర్మించాలి.ప్యాపిలి కాంగ్రెస్ పార్టీ డిమ్యాండ్. ప్యాపిలి పట్టణంలో మరియు మండలంలోనీ వివిధ గ్రామాలలో తాగునీటి సౌకర్యాన్ని, మరియు డ్రైనేజ్ లు నిర్మించాలని అన్నారు. ప్రధానంగా
ఊటకొండ గ్రామం లో బీసీ కాలనీలో సిసి రోడ్లు మురుగునీటి కాలువలు నిర్మించాలని, ప్యాపిలి కాంగ్రెస్ మండల అధ్యక్షులు M.N. సుబ్బు యాదవ్ శేషయ్య ఆధ్వర్యంలో స్థానిక మండల యంపీడీఓ కార్యాలయం లో, యంపీడీఓ ఫజుల్ రహిమాన్ విన్నత పత్రం సమర్పించరు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో నీ వివిధ గ్రామాలలో డ్రైనేజ్ లేక వర్షం నీరు అంతా మట్టి రోడ్డు పైకి వచ్చి ఉండడం వలన అనేక అంటువ్యాధులకు, గురి అవుతున్నారు. ముసలి వాళ్లు, చిన్నపిల్లలు, ఆ మురుగు నీటిలో పడి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం జరుగుతుంది. ఊటకొండ గ్రామం లోని ఇలాంటి సమస్య ఎక్కువగా ఉన్నది. కావున అధికారులు స్పందించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని, వారు డిమాండ్ చేశారు. లేని పక్షములో మండలంలోని అన్ని గ్రామాలను పరిశీలించి దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని, వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, వీర రాజు, రా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment