పొందూరు మండలంలోని వి ర్ గూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు స్థానిక గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు 50000/- వేలు రూపాయలు నగదు రూపంలో నిర్మాణానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సువ్వారి శ్రీనువాసురావు(కింతలి గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మాజీ చైర్మన్) కు అందించటం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామం,గ్రామంలో ఉన్న ప్రజల కొరకు ఉపయోగపడే విధంగా చేసే ప్రతి పనిలో యువత ముందుండి ప్రాతినిధ్యం వహించాలని కోరడం జరిగింది.నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించిన వారిలో పెడడా వెంకటరావు, బెండి రాజు,సువ్వారి ఈశ్వర్ రావు,సువ్వారి రామకృష్ణ తదితరులు ఉన్నారు.
గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్