అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్న హిందువాహిని ,భాజపా నాయకులు

కఠిన చట్టాలతో నిందితులను శిక్షించండి తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి

షాద్ నగర్ పట్టణంలో ని టోల్ ఫ్లాజ సమీపం లో రెండు కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న గోవులను భాజపా నాయకులు ,హిందువాహిని పట్టుకోవడం జరిగింది.బిజెపి రాష్ట్ర నాయకులు  శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లే గోవులను రక్షణ లేకుండా పోయిందన్నారు. హిందువులు గోమాతగా పూజించే గోవులను అక్రమంగా తరలించి కోయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. కంటైనర్ లో వందల కొద్దీ కుక్కి వాటి ప్రాణాలను తీస్తుంటే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు . ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసి గోవులను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందన్నారు.కఠిన చట్టాలు చేసి నిందితులను శిక్షించే దాకా భాజపా ,హిందువాహిని,గోరక్షాదల్ అద్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని అన్నారు.
పట్టుకున్న గోవులను గోశాలకు పంపించడం జరిగిందని అన్నారు.
ఈయొక్క కార్యక్రమంలో భాజపా నాయకులు, హిందువాహిని సోదరులు ఋషికేశ్,పసుల నర్సిహ్మ, పసులోటి శ్రావన్ , తదితరులు పాల్గొనడం జరిగింది.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ మహేష్ రంగా రెడ్డి జిల్లా.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment