సిపిఐ 96వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

96 వ ఆవిర్భావ స్పూర్తితో ఉద్యమాల ఉధృతిని కొనసాగిద్దాం

కష్ట జీవులకు అండగా CPI ఆవిర్భావ వేడుకల్లో తమ్మళ్ల.రావులపల్లి

భద్రాచలం… భారత కమ్యూనిస్టు పార్టీ 96 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక CPI కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు..
అనంతరం పట్టణ కార్యదర్శి అకోజు సునిల్ అధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవి కుమార్ మాట్లాడుతూ 96 వ ఆవిర్భావ స్పూర్తితో మరిన్ని ఉద్యమాలకు శ్రీ కారం చుట్టలని దేశంలో ప్రజావ్యతిరేక విధానాలపై .ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ఉండటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని అన్నారు..దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ లకు ప్రజా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని పోరాటాల ద్వారా ప్రజా సమస్యలపై కార్యకర్తలు పోరాటం చేయాలని అన్నారు..అనేక ఉద్యమాలు పోరాటాలు. త్యాగలతో ఎరుపెక్కిన ఎర్రజెండా ను .అమరవీరులు అందించిన ఎర్ర బాటలో ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో CPI నాయకులు బల్లా సాయి కుమార్.svs నాయుడు. భద్రాద్రి వెంకటేశ్వరరావు. విశ్వనాద్.మహేష్. AISF పట్టణ కార్యదర్శి మారెడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు..

ప్రజా  నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment