వైయస్ షర్మిలమ్మ జన్మదిన వేడుకలు

ఓదార్పు యాత్ర చేస్తున్న జగనన్నని అక్రమంగా అరెస్ట్ చేయిస్తే అన్నకు తోడుగా నేనున్నా అని మరో ప్రజాప్రస్థానం ద్వారా సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర పుటలకెక్కి ఆంధ్రప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న రాజన్న ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మకు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కార్యాలయం నందు వైయస్ఆర్ నాయకులు కార్యకర్తలు.మహిళా అనే పదానికి నిజమైన నిర్వచనం మన షర్మిలమ్మ
తండ్రి గారాలపట్టి మాత్రమే కాదు, ఆయన ఆశయసాధనను పుణికిపుచ్చుకుందామె అన్నకు తోడుగా నడిచింది  ప్రజల కోసం నిలబడింది నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న వైయస్ షర్మిలమ్మ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సుహాసిని.రాజన్న సమాధి సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్రకి అంకితమైన జగనన్నని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేయిస్తే తండ్రి ఆలోచనల పరంపర రేపటి తరాలకు అందాలన్న లక్ష్యంతో అన్న ఇచ్చిన మాట అక్షరసత్యం కావాలన్న సంకల్పం తో జగనన్న అడుగుజాడల్లో తోడుగా నేనున్నానంటూ ‘మరో ప్రజా ప్రస్థానం’ ద్వారా 3000 కి.మీ సుదీర్ఘ పాదయాత్ర తో చరిత్ర పుటలకెక్కి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టి, రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కైవశం చేసుకున్న రాజన్న గారాల పట్టి, జగనన్న సోదరి షర్మిలమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేదార్ నాథ్ రాయలసీమ సమన్వయకర్త వైయస్సార్ 24 ఫౌడేషన్. ఈ వేడుకల్లో వాణి, శోభారాణి, సాంబ, కుమార్, నజీర్, నవీన్, హనీఫ్, షబ్బీర్, సతీష్, ఇమ్రాన్, వసంత్, ఆది, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment