వెల్దుర్ధి లో సిపిఐ 96వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

96వ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా రైతుల రైతు వ్యతిరేక విధానాలను ఎండగడతము… సిపిఐ

వెల్దుర్ధి లో సిపిఐ 96వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ. కృష్ణ. ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

సిపిఐ వెల్దుర్ధి మండల కార్యదర్శి టీ. కృష్ణ. మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమం నుండి పనిచేసిన త్యాగధనుల పార్టీ సిపిఐ. నాడు స్వతంత్ర ఉద్యమం కోసం అనేకమంది పోరాట యోధులు తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పని చేశారు.ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు ఎండగడతామని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా సవాల్ చేస్తున్నాం. రైతులకు రక్షణ కల్పించలేని చట్టాలను వారి తలకు ఉరి గా బిగిస్తున్నారు…రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోడ్డు పైకి తెస్తున్నారురైతు ఉద్యమంలో ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో ప్రాణాలను అర్పించిన రైతులను చూసి ప్రజలు చలించి పోతున్నారు.
కేంద్రం లో నరేంద్ర మోడీ బెటి బచావో బేటి పడావో అనే నినాదంతో ప్రతి ఒక్క చోట వాల్ పోస్టర్లు కే పరిమితం చేస్తున్నారు. బేటి పడావో లేదు బేటీ బచావో లేదు కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే. పసి పిల్లలు సైతం మానవ మృగాలుగా మారి అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా చలనం ఉందాఆడవారి రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నా కూడా పనిచేయడం లేదు. చట్టాలు ఉన్నవాళ్లకు ఊడిగం చేస్తున్నాయి. ఓ జగన్మోహన మహిళల యొక్క మాన ప్రాణాలను కాపా డు. మహిళలకు రక్షణ కల్పించు చట్టాలను బలోపేతం చేసి క్రూర మృగాల బారి నుండి కాపాడు. దీని కోసం మహిళలను ఎంత ఉద్యమానికైనా సిద్ధ పడతా మని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు aisf జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సోమన్న . సంఘము నాయకులు బాలు రాజు. మాధవ్ కృష్ణ. డీ. రాజు శ్రీరాములు. నారాయణ భాషా. రాజు. మధు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment