రైతు భరోసా కేంద్రాలను సందర్శించిన మండల వ్యవసాయాధికారి

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని మాదాపురం గ్రామం మరియు బింగిదొడ్డి గ్రామ రైతు భరోసా కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ సందర్శించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబి పంట నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రైతులు పండించే పంటను తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే డోన్ హబ్ నందు రైతులు కావలసిన రసాయన మందులు కానీ, ఎరువులు మరియు 14-35-14, 10-26-26,28 -28-0, లు మీకు అందుబాటులో ఉన్నవి. మీ గ్రామం నందు రైతు భరోసా కేంద్రంలో ఫర్టిలైజర్ బుక్ చేసుకున్న ఎడల రెండు రోజులలోపు అందించబడును అని తెలిపారు. అలాగే పంటపొలాలను కూడా పరిశీలించ సాగారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు రవి ప్రకాష్ మరియు వి వి ఏ లు, రికార్డ్ అసిస్టెంట్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.వెల్దుర్తి ప్రజా నేత్ర న్యూస్ మౌలాలి..

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment