రైతు భరోసా కేంద్రం మరియు వ్యవసాయ అధికారి కార్యాలయ పనుల పరిశీలన

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో వ్యవసాయ శాఖ డోన్ అశోక్ వర్ధన్ రెడ్డి మరియు మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ మరి పంచాయతీ సీఈవో ఉపేందర్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది ఈరోజు కొత్తగా రైతు భరోసా కేంద్రం మరియు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం పనులు ప్రారంభించి వాటిని పరిశీలించడం జరిగినది. అంతే కాకుండా రామళ్లకోట రోడ్డు నందుగల మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సొంతం మార్కెట్ నందు గల డాక్టర్ వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్న పంచాయితీ ఆఫీసు నందు మార్చబడినది. కావున ఈ విషయాన్ని ప్రజలు గమనించగలరని తెలిపినారు. అలాగే ఏ డి ఏ డోన్ పి.అశోక్ వర్ధన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కార్యాలయము నందు ఏఈఓ తో మరియు వి ఏ ఏ వెల్దుర్తి వారితో సమీక్ష నిర్వహించి రైతు భరోసా కేంద్రాల లో జరుగుతున్న పనులను అడిగి తెలుసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమం నందు మండల కన్వీనర్ బొమ్మన రవి రెడ్డి మరియు ఎ డి ఏ పి. అశోక్ వర్ధన్ రెడ్డి మండల వ్యవసాయాధికారి రవి ప్రకాష్ మేజర్ పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి, వ్యవసాయ శాఖ ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.వెల్దుర్తి ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment