రూ.200 కోట్లకు చేరువలో భీమ్లా నాయక్ వసూళ్లు

  • ఇప్పటి వరకు రూ.192.04 కోట్ల వసూళ్లు
  • మొదటి వారంలోనే రూ.170.74 కోట్లు
  • రెండో వారంలో రూ.16.30 కోట్లకు తగ్గుముఖం
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన చిత్రం భీమ్లా నాయక్ వసూళ్లు పల్చబడ్డాయి. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్ల లక్ష్యానికి చేరువగా వచ్చింది. మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసుకోగా.. ఆ తర్వాత నుంచి వసూళ్లు తగ్గిపోయాయి. ఈ వారంలోనే రూ.200 కోట్ల మార్క్ ను చేరుకుంటుందా? లేక వచ్చే వారమా? అన్నది చూడాల్సి ఉంది.
సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ మూడు వారాలు పూర్తి చేసుకుంది. ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయన్ అంచనాల మేరకు.. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.192.04 కోట్లను వసూలు చేసింది. మొదటి వారంలో రూ.170.74 కోట్లు, రెండో వారంలో రూ.16.30 కోట్లు రాబట్టుకుంది. ఇక మూడో వారంలో మొదటి రోజు రూ.1.39 కోట్లు, రెండో రోజు రూ.1.54 కోట్లు, మూడో  రోజు రూ.1.67 కోట్లు, నాలుగో రోజు రూ.0.40 కోట్లు వెరసి 19వ రోజు చివరకు (16వ తేదీ) మొత్తం రూ.192.04 కోట్లు వసూలయ్యాయి.
Comments (0)
Add Comment