– పుణ్యస్నానాలు కై భక్తులకు తొలగిన ఇక్కట్లు
– ఎమ్మెల్సీ బాలసాని ఆదేశాలతో గ్రామపంచాయతీ చర్యలు
భద్రాచలం పట్టణంలోని మురుగునీరు.. గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే చోట కలుస్తూ ఉండడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ విషయం ఇటీవల భద్రాచలం వచ్చిన ఉభయ ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన స్వయంగా గోదావరి తీరం పరిస్థితిని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మురుగునీటిని పక్కకు మళ్లించాలని గ్రామ పంచాయతీ ఈఓ కు సూచించారు. దీంతో గ్రామ పంచాయతీ అధికారులు తక్షణ చర్యలకు పూనుకున్నారు. ఇప్పటివరకు మురుగునీరు వస్తున్న ఆ కాలువకు 400 మీటర్ల దూరంలో మరో కాలువను తీసి…ఆ మురుగునీటిని అటుగా మళ్ళించారు. దీంతో పుణ్య నానాలు ఆచరించే భక్తులకు ఇక్కట్లు తొలిగాయి. భక్తుల అసౌకర్యాన్ని గమనించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేలా…. చొరవ చూపిన జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారి సేవలను పలువురు కొనియాడారు..
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్