మద్దికేర మండలం లో చైన్ చోరీ

మద్దికేర మండల పరిధిలోని ఎడవల్లి గ్రామానికి చెందిన ఆకుల సుంకన్న భార్య ఆకుల లింగమ్మ వయసు 30 సంవత్సరాలు అనే రైతు మహిళ మధ్యాహ్నం సమయంలో పొలం పని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతూ ఉండగా మధ్య మార్గంలో వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఒంటరిగా వెళుతున్న మహిళను చూసి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు చైను దుండగులు లాక్కెళ్లారు ఆమె హుటాహుటిన ఏడ్చుకుంటూ ఇంటికి రాగా ఆమె కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఆ దుండగులను వెంబడించగా ఫలితం లేకపోయింది వెంటనే మద్దికేర స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరి ఎస్ఐ మస్తాన్వలి కి విషయం తెలియజేయగా ఎస్సై స్పందించి దుండగులు చరవాణి లభించడంతో చరవాణి ఆధారంగా నిందితులను గుర్తించి బంగారాన్ని రికవరీ చేశారు ఎడవల్లి గ్రామ ప్రజలు ఎస్సై కు పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు దుండగులు బంగారు చైన్ ఎక్కడ ఉందో తన మిత్రులకి తెలియజేసి పారి పోవడం జరిగింది ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment