బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్.కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబ్…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంగం మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబ్ అన్నారు. ఆదివారం మండలంలోని కేంద్రంలో 64 వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహులపేట మండల ఎంపీపీ సుశీల యాదగిరి రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కెవిపిస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబ్ మాట్లాడుతూ దేశంలో ప్రతి రాజకీయపార్టీ పై అంబేద్కర్ ప్రభావముంది కానీ ఇది కేవలం బడుగు బలహీన వర్గాల ఓట్లు దక్కించుకొనటానికే కాని సమాజాభ్యుదయం జరగటంలేదని విమర్శించారు. అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంగం జిల్లా కార్యదర్శి వెంకట్ రామ్ నర్సయ్య మాల మహానాడు జిల్లా నాయకులు గుండాల బిక్షం ముదిరాజ్ యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకరబోయిన నాగేశ్వరరావు కెవిపిఎస్ మండల అధ్యక్షులు కురంది సురేష్ వైస్ ఎంపీపీ దేవేందర్ సర్పంచ్ వేముల రజిత రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జినకల రమేష్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మైదం దేవేందర్ అడ్వకేట్ గౌస్ టిఆర్ఎస్ నాయకులు ఖాజా మియా తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment