హంప గ్రామంలో నీరు ఉండి కూడా నీరు వదలనీ పంచాయతీ సిబ్బంది.
– మద్దికేర మండలం పరిధిలోని హంప గ్రామంలో పుష్కలంగా నీరు ఉండి కూడా పంచాయతీ సిబ్బంది నీరు వదలడం లేదు ఎందుకు వదలడం లేదు అని అడిగితే పైప్లైన్ పనిచేయడం లేదు కనెక్షన్ సరిగా లేదు ఏవేవో కబుర్లు చెబుతూ వచ్చారు. ఇంతవరకు మా కాలనీలో చేతి పంపు బోరంగి ఉండేది అందువలన నీరు వదలక పోయినా బోరింగ్ ద్వారా వాటర్ తెచ్చుకొని వినియోగించుకునేవారు ఇప్పుడు అది కూడా చెడిపోవడంతో పక్కనే ఉన్న తోట పొలాల్లోకి వెళ్లి తెచ్చుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత తోట రైతులు కూడా వాటర్ తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. ఆ కాలనీ వాసులు అందరూ కలసి ఈరోజు పంచాయతీ సెక్రెటరీ ని అడిగితే వీలైనంత తొందరగా నీళ్ళు వదులుతానని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం అందించాలంటు గ్రామ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.