పైప్ లైన్ లీకేజీతో నష్టపోయిన వారికి నష్టపరిహారం అందేల చర్యలు తీసుకుంటాం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్టావ్ పల్లె గ్రమంలో ఎంపిపి *శ్రీ వుట్కూరి వెంకట రమణా రెడ్డి ఇల్లంతకుంట మండలం వెంకట్రావ్ పల్లే లో టిఫైబర్ కెబుల్ తవ్వకాలలో భాగంగా మిషన్ భగిరధ పైప్ లైన్ పగిలి వాటర్ లీకేజి అయ్యిందని, దీంతో పెద్ద ఎత్తున నీరు 5 ఇండ్లలోకి చేరిందని *ఎంపిపి వుట్కూరి వెంకటరమణా రెడ్డి * అన్నారు. దీంతో లీకేజి అయిన కొద్ది సమయంలో నే సంబందిత అధికారుతో మాట్లాడి నీటి సరఫరాను నిలిపివేయడం జరిగిందన్నారు. శుక్రవారం సంబంధిత అధికారులు, సిబ్బంది వచ్చి పైప్ లైన్ లీకేజీ పనులను పరిశీలించి మరమ్మత్తులు వేగవంతంగా చేస్తున్నారని ఆయన అన్నారు. ఇడ్లలోకి నీరు చేరడంతో నష్టపోయిన వారి కుంటుంబాలకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని నష్ట పరిహారం అంచన వేశామన్నారు. గుంతలుగా మారిన రోడ్డు మరమ్మత్తులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రంమంలో సర్పంచ్ మందసుశీల లింగం, ఉపసర్పంచ్ బాలయ్యగౌడ్,డైరెక్టర్ నవీన్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment