పీఆర్సీపై ముగిసిన జగన్ సమీక్ష.. రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ

ఉద్యోగులకు పీఆర్సీ అంశంపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సారాంశాన్ని ఈ సమావేశంలో సీఎంకు అధికారులు వివరించారు.

ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. ఎంతమేరకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చనే విషయంపై చర్చలు జరిపారు. ఫిట్ మెంట్ ఎంత శాతం ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయంపై సీఎంకు అధికారులు నివేదిక ఇచ్చారు.

మరోవైపు ఉద్యోగ సంఘాలతో జగన్ రేపు చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత ఫిట్ మెంట్ ను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు పీఆర్సీ వ్యవహారాన్ని ఇక నాన్చకుండా తేల్చేయాలని సీఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Tags: Jagan, YSRCP, Govt employees, PRC Fitment

Comments (0)
Add Comment