తడి చెత్త పొడి చెత్త సేకరణ పై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలం* లోని “పొత్తూర్” గ్రామంలో మహిళలకి తడిచెత్త పొడిచెత్త సేకరణ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ZP వైస్ చైర్మన్ సిద్ధం వేణు వారు మాట్లాడు పాడైపోయిన ఆహారపదార్థాలు, వంట చేసేటప్పుడు కట్ చేసిన మిగులు వ్యర్థాలు, కుళ్ళి పోయిన కూరగాయలు, పండ్లు లాంటి తడిచెత్త ఒక బుట్టలో, చిత్తు కాగితాలు, పాలప్యాకెట్స్, బాటిల్స్, షాంపూ బాటిల్స్, ఊడ్చిన దుమ్ము లాంటి పొడిచెత్త ఒక బుట్టలో వేరవేరుగా వేస్తూ రెండు రోజుల కి ఒకసారి వచ్చే గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేయాలని తెలుపడం జరిగింది. ఇచ్చిన చెత్త బుట్టలు చెత్తకే వినియోగించాలని పప్పులు నీళ్ళకు వాడకూడదని తెలపడం జరిగింది. ప్రతి కుటుంబం తప్పనిసరి స్థలాన్ని బట్టి ఆరు ఆపైన హోమ్ స్టెడ్ మొక్కలు నాటి వాటిని కాపాడుతూ పచ్చదనాన్ని పెంచాలని తెలపడం జరిగింది. ప్రతి కుటుంబం ఇంకుడుగుంత, మరుగుదొడ్లు వినియోగించుకోవలని , బహిరంగ మల విసర్జన చేయకూడదని తెలుపడం జరిగింది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు గారు ,ఎంపిడిఓ విజయ , సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ అశ్విని శ్రీనివాస్, ఏపీయం వాణిశ్రీ, గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్, సీసీ వెంకటేశం , ప్యాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వీఓ అధ్యక్షులు మంగ, సౌజన్య, వీఓఏలు జ్యోతి, లావణ్య, వార్డు మెంబర్స్, మహిళలు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.. బొల్లం సాయి రెడ్డి మండల రిపోర్టర్.

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment