జర్నలిస్ట్స్ కు అన్నివిధాలా అండగా నిలవాలన్నదే సిఎం ద్యేయం ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్

విజయవాడ:నిజమైన జర్నలిస్ట్స్ కు మేలు చేయాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ద్యేయమని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ రెడ్డి అన్నారు. శనివారం విజయవాడ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో తనను కలసి పెన్ నేతలతో ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్స్ సమస్యల పట్ల ముఖ్యమంత్రి కి పూర్తి అవగాహన ఉందన్నారు. నిజమైన జర్నలిస్టులకు మేలు చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అక్క్రిడిటేషన్స్ జారీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానం ద్వారా నకిలీల బెడద తప్పుతుందన్నారు. జర్నలిజం ముసుగులో, అర్హత లేని అక్షరజ్ఞాన మెరుగని దుష్టశక్తులు ప్రవేశించి సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా గౌరవాన్ని అందుకుంటున్న మీడియా ని నవ్వులపాలు చేస్తున్నారన్నారు. నకిలీలను ఏరివేసి నిజమైన పాత్రికేయులకు అన్నివిధాలా అండగా నిలవాలన్నదే ప్రభుత్వ ద్యేయం అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డిని కలిసిన వారిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ ) నేతలు బడే ప్రభాకర్, తాడి రంగారావు, వక్కలంక రామకృష్ణ తదితరులున్నారు.

 

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment