కొండగట్టు అంజనేయ స్వామికి పూజలు చేసిన పవన్ కళ్యాణ్

సినీ హీరో పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే యువత ఉర్రూతలూగుతారు. తెరపై కనిపించే ఆ హీరో తమ వద్దకు వస్తున్నాడంటే యువకులు అభిమాన హీరోను దగ్గర నుంచి చూడాలని వెళుతారు. ఇగో.. పవన్ కళ్యాణ్ ను చూడటానికి వేలాది మంది రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు లో తన ప్రచార రథం వారాహి కి పూజలు జరిపించారు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

మంగళవారం విచ్చేసిన ఆయనకు కొండగట్టు దిగువ ప్రాంతంలో అభిమానులు క్రేన్ సాయంతో భారీ గజ మాలతో స్వాగతం పలికారు. తమ అభిమాన సినీ హీరో కళ్ళ ముందే ఉండటంతో వారు కేరింతలు కొడుతూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ ను తమ సెల్ ఫోన్ లో ఫోటోలు తీయడానికి ఆసక్తి కనబరిచారు

Comments (0)
Add Comment