కేంద్రం దిగిరాకుంటే ప్రతి గ్రామాన్ని ఉద్యమ కేంద్రంగా మారుస్తాం

భద్రాద్రికొత్తగూడెం: రైతులకు, వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించే నూతన వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో కేంద్రం దిగిరాకుంటే ప్రతి గ్రామాన్ని ఉధ్యమ కేంద్రంగా మారుస్తామని వామపక్ష, విపక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు, పోతినేని సుదర్శన్, గుమ్మడి నర్సయ్య, యడవల్లి కృష్ణ, తాళ్లూరి వెంకటేశ్వర్ రావు, జె. సీతారామయ్య స్పష్టం చేశారు. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలు, కేంద్ర విద్యుత్‌ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర చట్టబద్ద హక్కు చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా వామపక్షాలు, విపక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరపతలపెట్టిన 18 రోజుల దీక్షను కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో సోమవారం నాయకులు ప్రారంభించి మట్లాడారు. రైతులను దివాలా తీయించే నూతన చట్టాల రద్దుకోసం దేశరాజధాని ఢిల్లీలో మూడు వారాలుగా రైతాంగం శాంతియుతంగా ఉద్యమిస్తుంటే కేంద్రం స్పందించకపోగా అణచివేతన చర్యలకు పాల్పడుతుందన్నారు. అన్నం పెట్టే రైతన్న ఘోషను మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమైందన్నారు. ఇప్పటిక అతివృష్టి, అనావృష్టితో నష్టాల భారినపడుతున్న రైతన్నల్లు కేంద్రం తీసుకువచ్చిన కార్పోరేట్‌ చట్టాలతో మరింత దివాలాతీసి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కార్పోరేట్‌ శక్తులకు అనుకూలంగా చట్టాలను తీసుకుస్తూ ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, రైతాంగంపై కేంద్రం ముప్పెటదాడికి పూనుకుంటోందని విమర్శించారు. ఆరేళ్ళ బిజేపి పాలన పెట్టుబడిదారులకు, దళారి వ్యవస్థను పోత్సహిస్తూ సాగిందని, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. కొత్త సాగు చట్టాలతో దగాపడుతున్న ప్రతీ రైతు ఉద్యమ ఆయుధమై కేంద్రంపై తిరగబడి వ్యవసాయ రంగం కార్పోరేట్‌ శక్తుల చేతుల్లోకి వెల్లకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ అయిన రైతులు చేపట్టిన ఉద్యమంపై కేంద్రం స్పందించకుంటి ప్రతిఘటన ఉద్యమాలు నిర్వహించైనా చీకటి చట్టలను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకోసం విపక్షాలు చేపట్టిన దీక్షల ఉద్యమానికి అన్నివర్గాల ప్రజలు అండగా నిలబడి రైతుల్లో మనోదైర్యాన్ని నింపాలని కోరారు. వ్యవసాయ చట్టం వల్ల మార్కెట్‌ కమీటీల వ్యవస్థ కుప్పకూలీపోయి రైతన్న కూలీగా మారే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. అదానీలు, అంబానీలు, ఆమెజాన్‌, వల్‌మార్ట్‌ వంటి కార్బోరేట్‌ సంస్థలకు లాభాలు చేకూర్చి రైతులను నష్టపరిచేలా చట్టం చేయడం మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నీదర్శనమని, వ్యవసాయ బిల్లుతో రైతు మెడకు ఉరిబిగించారని విమర్శించారు. రైతును రాజు చేస్తామని గద్దెనెక్కి ప్రభుత్వాలు గద్దెనెక్కెందే తడవుగా ఆ రైతు నడ్జెవీరిచే చర్యలకు పూనుకుంటున్నాయన్నారు. కొత్త వ్యవసాయ సాగు చట్టాలు పెట్టుబడిదారులను మరింత కుబేరులుగా మార్చె విదంగా రూపొందించారన్నారు. కేంద్రం పాలన అదాని, అంబానీ లాంటి కుబేరుల కనుసైగల్లో నడుస్తోందని విమర్శించారు. దేశ సంపదను, కార్మికులు, కర్షకుల శ్రమశక్తిని కార్పోరేట్‌ శక్తులకు దోచిపెడుతూ దేశాన్ని తిరోగమణ బాట పట్టిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాబీర్‌ పాషా, బందెల నర్సయ్య, ఏపూరి బ్రహ్మం, గుత్తుల సత్యనారాయణ, వై. శ్రీనివాసరెడ్డి, నరాటి ప్రసాద్‌, కంచర్ల జమలయ్య, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి మురళి, జి. వీరస్వామి, ఈసం రమాదేవి, రత్నకుమారి, నాగుల్‌ మీరా, చాంద్‌ పాషా, చింతల రాజు, సిపిఎం, ప్రజా సంఘాల కాసాని ఐలయ్య, అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, జాటోత్‌ కృష్ణు భూక్య రమేష్‌, వీర్ల రమేష్‌, కొండపల్లి శ్రీదర్‌, కొండబోయిన వెంకటేశ్వర్లు, నల్లమల్ల వెంకటేశ్వర్‌రావు, యాస నరేష్‌, లిక్కి బాలరాజు, న్యూడెమోక్రసి నాయకులు ఆవునూరి మధు, చంద్ర అరుణ, మాచర్ల సత్యం, ముక్తి సత్యం, ముద్దా బిక్షం, కందగట్ల సురేందర్‌, ఆర్‌. అశోక్‌, అనుమల రాము, కల్లూరి కిషోర్‌, ప్రభాకర్‌, చీమల రాంబాబు, ఎం రమేష్‌, ఉమర్‌, రామస్వామి, కృష్ణ, కాంగ్రేస్‌ జిల్లా నాయకులు నాగ సీతారాములు, జలీల్, కాలం నాగభూషణం, దేవి ప్రసన్న, పౌల్స్‌ బండి రాజేష్‌, టిజెఎస్‌ జిల్లా నాయకులు శివప్రసాద్‌, నభి తదితరులు పాల్గొన్నారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment