కష్ట జీవులకు అండగా –భారత కమ్యూనిస్టు

ఆదిలాబాద్, భారత కమ్యూనిస్టు పార్టీ 96వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ లోని CPI కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని CPI జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ 96వ ఆవిర్భావ స్పూర్తితో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుట్టలని, దేశంలో ప్రజావ్యతిరేక విధానాలపై, ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా కార్పొరేట్ శక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయని అన్నారు.దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ పెత్తనం పెరిగిపోయిందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. కొత్త చట్టాలు తీసుకొస్తూ దేశ ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలకు ప్రజా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని పోరాటాల ద్వారా ప్రజా సమస్యలపై కార్యకర్తలు పోరాటం చేయాలని అన్నారు. అనేక ఉద్యమాలు పోరాటాలు త్యాగలతో ఎరుపెక్కిన ఎర్రజెండాను అమరవీరులు అందించిన ఎర్ర బాటలో ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో AITUC జిల్లా ప్రధాన కుంటల రాములు, AIYF జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్, CPI పట్టణ కార్యదర్శి అరుణ్ కుమార్, AISF జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ , AISF జిల్లా ఉపాధ్యక్షులు గేడం కేశవ్ తదితరులు పాల్గొన్నారు..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment