ఒక్క సిసి కెమెరా వంద పోలీసులతో సమానం : రూరల్ ఎస్.ఐ.

నల్లగొండ : సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో దొంగతనాలు, ఆకతాయిల ఆగడాలు, అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని నల్లగొండ రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.మంగళవారం కమ్యూనిటి పోలీసింగులో భాగంగా నల్లగొండ మండలం అనంతారం గ్రామంలో ఏడు సిసి కెమెరాల ఏర్పాటు కోసం గ్రామ సర్పంచ్ కేదార్ చొరవతో గ్రామస్థులు భాగస్వామ్యం అయ్యి లక్ష రూపాయలు నగదు సిసి కెమెరాల ఏర్పాటు కోసం రూరల్ ఎస్.ఐ. సమక్షంలో అందచేశారు. ఈ సందర్భంగా ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని, ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పెట్టుకోవచ్చని చెప్పారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ మండల పరిధిలో అన్ని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో అనంతారం గ్రామ పెద్దలు రుద్రాక్షి శ్రీను, అంజయ్య, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment