ఆకతాయిల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మహిళలు వెంటనే షీ టీంను సంప్రదించండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : – మహిళలకు ఆకతాయిల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే షీ టీంను సంప్రదించాలని ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లాలో ఏ ప్రదేశంలోనైనా ఆకతాయిల వలన ఇబ్బందులు కలిగితే షీ టీంను నేరుగా గానీ, వాట్సాప్ ద్వారా గానీ సంప్రదించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు.జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో షీ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.7901145721 నంబరుకు నేరుగా ఫోన్ గానీ,వాట్సాప్ ద్వారా గాని మెసేజ్ చేస్తే ఏ ప్రదేశంలోనైనా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు.స్కూళ్ళు,కాలేజీలు,బస్టాండ్లు,రైల్వే స్టేషన్,షాపింగ్ ప్రదేశాలలో షీ టీం సభ్యులు ఎల్లప్పుడూ మఫ్టీలో సంచరిస్తూనే ఉంటారని తెలియజేసారు. కావున మహిళలకు ఆకతాయిల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారికి షీ టీం అండగా ఉంటుందని అన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

 

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment