అరబిందో ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం కల్పించాలని పి.తేజేశ్వరరావు డిమాండ్

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం అరబిందో ప్రమాదంలో గాయపడిన కార్మికులకు యాజమాన్యం మెరుగైన వైద్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం అరబిందో ఫార్మా పరిశ్రమలో డిసెంబర్17న వేర్ హౌస్-6 వద్ద 20లక్షల లీటర్ల వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కూలి 7గురు కార్మికులు గాయపడిన వారిని సోమవారం మిమ్స్ హాస్పిటల్లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు,అరబిందో యూనియన్ నాయకులు మిమ్స్ హాస్పిటల్ లో కార్మికులను పరామర్శించారు.కార్మికులు బుల్లమ్మ, కుమారి, ఎల్.లక్ష్మీ,, డి.లక్ష్మీ,, మహలక్ష్మునాయుడు, పార్వతమ్మ, నర్సింగరావు ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు యాజమాన్యం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి కె.గురునాయుడు, యస్.అప్పలరాజు, పి.వెంకటప్పారవు, ఎన్.తారకేశ్వరరావు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment