ఏపీ39టీవీ న్యూస్ మే 14
గుడిబండ:- వివరాల్లోకి వెళితే మండలంలోని చిగతుర్పి గ్రామంలో మంగళవారం సాయంత్రం వర్షం గాలి బీభత్సం కురిపించింది ఈదురు గాలులతో చెట్లు విరిగి ఇళ్లపైకి పడడంతో ఇల్లు దెబ్బతిన్నాయి మహిళలకు స్వల్పగాయాలతో బయటపడ్డారు విషయం తెలుసుకున్న గుడిబండ రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి విఆర్ఓ లు నాగరాజు.రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి సంబంధిత బాధితులను పరామర్శించారు బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపోయిన మమ్ములను ఆదుకోవాలని కోరారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ