జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం,దుబ్బతండా గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను అభివృద్ధి పనులకు కాకుండా సర్పంచ్ తన సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నాడు. వరిధాన్యాన్ని పాలకుర్తి మండలకేంద్రంలోని రైస్ మిల్లుకు తీసుకురాగా కొందరు వ్యక్తులు గమనించి ఆరా తీసి అడుగగా డొంకతిరుగు సమాధానం చెబుతున్నాడు.ప్రభుత్వం ప్రతీ గ్రామపంచాయతీ కి ట్రాక్టర్ ను ఇచ్చింది వాళ్ళసొంత పనులకు కాదని..గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకని..ఇప్పటికైనా అధికారులు చొరవతీసుకొని..కఠినచర్యలు తీసుకోవాలని..స్థానికులు కోరారు.